నేడు తొలి మంత్రివర్గ సమావేశం

అసెంబ్లీ ఎన్నికలలో ఘనవిజయం సాధించి రాష్ట్రంలో తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రిగా కేసిఆర్, హోంమంత్రిగా మహమూద్ ఆలీ మాత్రమే ప్రమాణస్వీకారం చేశారు. వారిరువురు నేడు ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారు. కనుక ఇదే తొలిమంత్రివర్గ సమావేశం అవుతుంది. ఈ సమావేశంలో వివిద శాఖలకు చెందిన ఉన్నతాధికారులు కూడా పాల్గొనబోతున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల హామీలపై చర్చించి నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం. పాలనాపరమైన అంశాలపై కూడా నేడు వారు అధికారులతో చర్చించవచ్చు. నేటి సమావేశంలో పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం కోసం ఆర్డినెన్స్ జారీ చేయవచ్చు. ఈనెల 17 నుంచి 20 వరకు శాసనసభ సమావేశాలు జరుగబోతున్నాయి కనుక వాటిలో చర్చించవలసిన ముఖ్యాంశాలపై కూడా నేటి సమావేశంలో చర్చించవచ్చు.