సంబంధిత వార్తలు

పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు నేడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఆ ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్లను తగ్గిస్తూ రాష్ట్రప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడాన్ని సవాలు చేస్తూ బీసీ సంక్షేమ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు, పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా వెలువడిన తరువాత ఎన్నికల వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని, ఎన్నికలను నిలిపివేయమని ఆదేశించబోమని స్పష్టం చేసింది. దీంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని అవరోధాలు తొలగిపోయినట్లయింది. ఈనెల 7వ తేదీ నుంచి 30 వరకు మూడు దశలలో పంచాయతీ ఎన్నికలు జరుగబోతున్నాయి.