
పంచాయతీ ఎన్నికలకు మంగళవారం సాయంత్రమే షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటికే ఆ ఎన్నికలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. తాజాగా బీసీ సంఘాల అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మంగళవారం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. రాష్ట్రంలో బీసీ జనాభా 52 శాతం ఉందని రాష్ట్ర ప్రభుత్వమే చెప్పిందని, కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపించి పంచాయతీ ఎన్నికలలో బీసీలకు కేవలం 22 శాతం రిజర్వేషన్లు కల్పించడం అన్యాయమని ఆర్.కృష్ణయ్య తన పిటిషనులో ఫిర్యాదు చేశారు. కనుక బీసీ రిజర్వేషన్ల సమస్యను పరిష్కరించేవరకు పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని ఆర్.కృష్ణయ్య తన పిటిషనులో కోరారు.