ఆ అరుగురికి మళ్ళీ అక్కడే పోస్టింగ్స్

తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శులుగా పనిచేస్తున్న ఆరుగురు సీనియర్ ఐఏఎస్ అధికారుల పనితీరు పట్ల ముఖ్యమంత్రి కేసిఆర్ సంతృప్తి చెందడంతో వారిని మళ్ళీ మరోసారి ముఖ్యమంత్రి కార్యాలయంలోనే కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషీ ఉత్తర్వులు జారీ చేశారు. 

ముఖ్యమంత్రి ప్రధానకార్యదర్శిగా వ్యవహరిస్తున్న స్మితా సభర్వాల్ కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరధ ప్రాజెక్టు పనులను అధనంగా అప్పగించగా ఆమె వాటిని సమర్ధంగా నిర్వహించడంతో ఆమెను ముఖ్యమంత్రి కార్యాలయంలోనే కొనసాగే అవకాశం లభించింది. 

రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి కె భూపాల్ రెడ్డి స్పెషల్ సెక్రెటరీగా, ఐఏఎస్ అధికారులు ఎస్.నర్సింగ్ రావు ముఖ్యకార్యదర్శులుగా మళ్ళీ నియమింపబడ్డారు.  అదేవిధంగా సెంట్రల్ సర్వీసస్ కు చెందిన గ్రేడ్-1 అధికారి పి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రికి ప్రత్యేక కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆయన ముఖ్యమంత్రి సహాయనిధులు, ముఖ్యమంత్రి కార్యాలయ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటారు. 

అదేవిధంగా 1998 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియా, 2005 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి కె మాణిక్ రాజ్‌భవన్‌లో లను మళ్ళీ ముఖ్యమంత్రికి అధనపు కార్యదర్శులుగా నియమితులైనారు.           

వీరుగాక వివిద శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులుగా కొనసాగుతున్న సీనియర్ ఐఏఎస్ అధికారులను కూడా యధాప్రకారం వారివారి పదవులలోనే కొనసాగించాలని సిఎం కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. 

ప్రత్యేక కార్యదర్శులు : అజయ్ మిశ్రా (ఇంధనశాఖ), రాజేశ్వర్ తివారీ (భూరెవెన్యూ).   

ముఖ్య కార్యదర్శులు: సోమేష్ కుమార్ (వాణిజ్య పన్నులు), కె రామకృష్ణ (ఆర్ధికశాఖ), సునీల్ శర్మ (రోడ్లు భవనాలు), వికాస్ రాజ్ (పంచాయతీ రాజ్). 

మిగిలిన ఐఏఎస్ అధికారులకు మంత్రివర్గం ఏర్పాటు చేసిన తరువాత శాఖలు బదలాయింపు ఉండవచ్చునని సమాచారం.