
యాదాద్రి భువనగిరిజిల్లా పరిసర ప్రాంతాలవాసులకు ఒక శుభవార్త. నేటి నుంచి జిల్లాప్రజలకు స్థానికంగా పాస్‌పోర్టు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు భువనగిరిలోని పోస్టాఫీసులో పాస్‌పోర్టు సేవాకేంద్రం ప్రారంభించబడుతుందని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం అధికారి డాక్టర్ ఇ.విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి భువనగిరి నరసయ్య గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం, నల్గొండ, వరంగల్, మెదక్, సిద్దిపేట, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌లలో ఇటువంటి పోస్టాఫీసు పాస్‌పోర్టు సేవాకేంద్రాలున్నాయి. భువనగిరితో కలిపి రాష్ట్రంలో మొత్తం 8 పోస్టాఫీసు పాస్‌పోర్టు సేవాకేంద్రాలు ఏర్పాటు చేసినట్లవుతుంది.