ట్రిపుల్ తలాక్ బిల్లు నేడు రాజ్యసభకు

మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ట్రిపుల్ తలాక్ బిల్లును ఇటీవల లోక్‌సభలో ఆమోదించుకొన్న సంగతి తెలిసిందే. నేడు దానిని రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవడానికి సిద్దం అవుతోంది. కానీ దానిని కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. రాజ్యసభలో తమకు తగినంత బలం లేకపోయినప్పటికీ ‘చిన్న చిట్కా’తో ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదింపజేసుకోబోతున్నామని బిజెపి ఎంపి సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్, బిజెపిలు రెండూ తమ రాజ్యసభ ఎంపీలకు విప్ జారీ చేశాయి. కీలకమైన ఈ బిల్లు చర్చ, ఓటింగ్ సందర్భంగా సభ్యులందరూ విధిగా సభకు హాజరుకావాలని ఆదేశించాయి. కనుక నేడు రాజ్యసభ సమావేశం ఆసక్తికరంగా సాగనుంది.