
అసెంబ్లీ
ఎన్నికలలో విజయం సాధించిన కేసీఆర్ వచ్చేనెల 21వ తేదీ నుంచి 25 వరకు తన ఎర్రవెల్లి
వ్యవసాయ క్షేత్రంలో 5 రోజుల పాటు మహారుద్ర సహితా సహస్ర చండీ మహాయాగం
చేయబోతున్నారు. ఈసారి కూడా చతుర్వేద పండితులైన జ్యోతిరాప్తోర్యామయాజీ మాణిక్య సోమయాజి, నరేంద్ర కాప్రే, పురాణం మహేశ్వర శర్మా, ఫణిశశాంక శర్మ తదితరుల అధ్వర్యంలో జరిగే ఈ మహాయాగంలో దేశంలో వివిద
రాష్ట్రాల నుంచి 200 మంది రుత్విక్కులు వచ్చి పాల్గొంటారు. ఈసారి చండీయాగానికి
విశాఖలోని శారదాపీఠాధిపతి స్వరూపనంద స్వామి కూడా పాల్గొనవచ్చు.
ఈ మహాచండీయాగం జరిగే 5 రోజులలో మొదటి రోజున 100, మరుసటి రోజు 200, మూడవ రోజున 300, 4వ రోజున 400, 5వ రోజున 500 చొప్పున సప్తశతీ చండీ పారాయణాలు చేయాలని నిర్ణయించారు. 5వ రోజున పూర్ణాహుతితో ఈ మహాచండీ యాగం పరిసమాప్తం అవుతుంది. వరుసగా జరిగే ఎన్నికలలో విజయం, ప్రజాసంక్షేమం కోరి సిఎం కేసీఆర్ ఈ యాగం చేస్తున్నారు.