.jpg)
గత నాలుగున్నరేళ్ళలో తెరాస ప్రభుత్వంపై సుమారు 5-6 వందలకు పైగా పిటిషన్లు వేసిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, తెరాస రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత మళ్ళీ మొట్టమొదటి పిటిషను వేసింది. ఆకుల లలిత, సంతోష్‌కుమార్, ఎంఎస్ ప్రభాకర్ రావు, కె. దామోదర్ రెడ్డి నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీల అభ్యర్ధన మేరకు శాసనమండలి కాంగ్రెస్ పక్షాన్ని తెరాసలో విలీనం చేయడాన్ని సవాలు చేస్తూ సీనియర్ కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ సోమవారం హైకోర్టులో పిటిషను వేశారు. ఆయన తన పిటిషనులో ఆ నలుగురు ఎమ్మెల్సీలను, వారిని తెరాస సభ్యులుగా గుర్తించిన శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్, ఆయన ఆదేశాలమేరకు బులెటిన్ విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. షబీర్ ఆలీ దాఖలు చేసిన ఈ పిటిషనుపై బుదవారం విచారణ చేపట్టే అవకాశం ఉంది.