లోక్‌సభ ఎన్నికలకు సిద్దం అవుతున్న సీనియర్లు

ముందస్తు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ, ఆ పార్టీలో ఓడిపోయిన సీనియర్ నేతలు తమ అదృష్టం  పరీక్షించుకోవడానికి లోక్‌సభ ఎన్నికలు మరో అవకాశం కల్పిస్తున్నాయి. కనుక అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డికె.అరుణ, సర్వే సత్యనారాయణ తదితరులు లోక్‌సభ ఎన్నికలలో తమ అదృష్టం పరీక్షించుకోవడానికి సిద్దం అవుతున్నారు. 

వారిలో రేవంత్‌రెడ్డి-మహబూబ్‌నగర్‌ లేదా వేరే నియోజకవర్గం నుంచి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి-నల్గొండ, విజయశాంతి-మెదక్, జైపాల్ రెడ్డి-మహబూబ్‌నగర్‌, రేణుకా చౌదరి-ఖమ్మం, సురేశ్ షెట్కర్-జహీరాబాద్, మధుయాష్కీ-నిజామాబాద్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి-చేవెళ్ళ, కె. సత్యనారాయణ-పెద్దపల్లి, మహబూబాబాద్-బలరాం నాయక్ పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకొంటున్నట్లు తాజా సమాచారం 

ఇక మాజీ ఎంపీలు జైపాల్ రెడ్డి, విజయశాంతి, మధుయాష్కి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రేణుకా చౌదరీ, సురేశ్ షెట్కర్ తదితరులు కూడా పోటీకి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. వీరే కాక టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, అజారుద్దీన్, పొన్నాల లక్ష్మయ్య, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు కూడా లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.