మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రమాణస్వీకారం

సోమవారం ఒకేరోజున మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ మూడు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్ సోమవారం ఉదయం జైపూర్‌లో ప్రమాణస్వీకారం చేయగా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్‌ మధ్యాహ్నం భోపాల్‌లో,  ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రిగా భూపేష్ బాఘెల్ సోమవారం సాయంత్రం రాయ్‌గఢ్‌లో ప్రమాణస్వీకారం చేశారు. దీంతో మళ్ళీ చాలా కాలం తరువాత బిజెపి మూడు కంచుకోటలు పూర్తిగా కాంగ్రెస్‌ హస్తగతం అయ్యాయి. కమల్‌నాథ్‌ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినవెంటనే రైతుల రుణమాఫీ ఫైలుపై సంతకం చేశారు. వీరి ప్రమాణస్వీకార కార్యక్రమాలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ లతో పాటు కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలైన జెడిఎస్, డిఎంకే, ఆర్జెడి తదితర పార్టీల అధినేతలు కూడా హాజరయ్యారు.