దేశంలోని అన్ని ముఖ్యమంత్రుల్లోకెల్లా తెలంగాణ సిఎం ఉత్తమ సిఎంగా ఎంపిక చేసింది కేంద్రం. దేశంలోని 29 రాష్ట్రాల ముఖ్యమంత్రుల పనితీరు ఆధారంగా, వారు ప్రవేశపెట్టిన పథకాలు, వారు ఆచరిస్తున్న విధానాలు, కొనసాగిస్తున్న పాలన లాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం నిర్వహించిన ఓ రిపోర్ట్ లో తెలంగాణ సిఎం కేసీఆర్ కు వందకు వంద శాతం మార్కులు వేసి.. దేశంలోనే నెంబర్ వన్ సిఎంగా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ పాలన ఉందని, ప్రజలు పూర్తి సంతృప్తి చెంది ఉన్నారని ఆ నివేదికలో తేలింది.
తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని తీసుకువస్తున్న పథకాలతో ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉన్నట్లు తేలింది. అన్నింటికి మించి అవినీతి మరక లేకుండా కేసీఆర్ సాగిస్తున్నపరిపాలన అందరి మన్ననలు పొందుతోంది.తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమన్యాయం జరిగే విధంగా మిషన్ కాకతీయ తో ఆర్థికంగా బలాన్ని, భూములను సస్యశ్యామలం చేసేందుకు పూనుకున్నారు. ఇంటింటికి నీళ్ల కోసం మిషన్ భగీరథను ప్రారంభించి, 80శాతం పూర్తీ కావడం జరిగింది.
ముస్లిం ఆడపిల్లల కోసం షాదీ ముబారక్, అన్ని వర్గాల వారి కోసం కళ్యాణ లక్ష్మి, నడవలేని చివరి దశలో ఉన్న వృద్దులకు ఆసరా, భర్త చనిపోయిన వారికి వితంతు పింఛను, దళిత విద్యార్ధులు విదేశాలలో చదువుకోవడానికి ప్రభుత్వం తరపున 25లక్షల వరకు ఆర్ధిక సహాయం, నిరుద్యోగ సమస్యను తీర్చడానికి ఇప్పటివరకు 30 వేలకు పైగా ఉద్యోగాలకు నోటిపికేషన్ లు, పేదవారి ఆకలి తీర్చడానికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 6 కిలోలు చొప్పున బియ్యం ఇలా ఎన్నో వినూత్న పథకాలతో పాటు గత రెండేళ్లుగా సీఎం కేసీఆర్ తీసుకొస్తున్న ఆవిష్కరణలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతూ వాటికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
హరిత తెలంగాణ కోసమే కాకుండా రైతుల కళ్ళలో ఆనందాన్ని చూడటమే కాకుండా రాష్ట్రం అంతా వర్షాలు విరివిరిగా కురవాలని, ప్రస్తుతం కాలుష్యం అయిన పర్యావరణాన్ని కాపాడటం కోసం పర్యావరణ పరిరక్షణ పేరిట కేసీఆర్ చేపట్టిన హరితహారానికి ప్రజల నుంచే కాకుండా పక్కరాష్ట్రాల నుండి కూడా విశేష స్పందన లభిస్తోంది. ఉమ్మడి రాష్ట్రం నుండి విడిపోయిన తర్వాత తెలంగాణ విద్యుత్ సమస్య, నీటి పంపకాల విషయంలో కాస్త ఇబ్బంది పడ్డా కేసీఆర్ సర్కార్ వాటిని ఎదుర్కొన్న తీరు తెలంగాణ ప్రజల మనసులు గెలుచుకుంది. కేంద్రం నుండి ఎలాంటి సహాయం రాకున్నా కానీ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో కేసీఆర్ అందరి సంక్షేమాన్ని ఆకాంక్షస్తూ పథకాలను ప్రవేశపెడుతున్నారు. బంగారు తెలంగాణ కలలను సాధించేందుకు అన్ని మార్గాలను సుగమం చేస్తున్నారు కేసీఆర్.