మహమూద్ ఆలీకి హోంమంత్రి పదవి

నిన్న కేసీఆర్‌తో పాటు రాజ్‌భవన్‌లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మహమూద్ ఆలీకి రాష్ట్ర హోంమంత్రిగా నియమించాలని సిఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. నేడు దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 

2001లో కేసీఆర్‌ తెరాసను స్థాపించినప్పటి నుంచి మహమూద్ ఆలీ ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుడుగా ఉంటూ కేసీఆర్‌ వెంట నడిచారు. 2007 లో తెరాస రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 2013లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తెలంగాణ ఏర్పడిన తరువాత 2014లో ఏర్పడిన తెరాస ప్రభుత్వంలో  మహమూద్ ఆలీ ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ మంత్రి పదవులను నిర్వహించారు. ఈసారి కీలకమైన హోంమంత్రి పదవి లభించడం విశేషం.