
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బిజెపి ఎంపీ బండారు దత్తాత్రేయ స్పందిస్తూ, “రాష్ట్రంలో పోలింగ్ సరళిని బట్టి చూస్తే బిజెపి మెజారిటీ స్థానాలు గెలుచుకొని అధికారంలోకి రాబోతోందని స్పష్టం అవుతోంది. రాష్ట్రంలో సైలెంట్ ఓటింగ్ జరిగింది. కనుక ఫలితాలు బిజెపికి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది,” అని అన్నారు. ఆయన నిన్న రాంనగర్‌లో ఓటు వేసిన వచ్చిన తరువాత ఈ మాట అన్నారు. కానీ సాయంత్రం పోలింగ్ తరువాత విడుదలైన సర్వే నివేదికలన్నిటిలో తెరాస విజయం సాధించబోతోందని 4-6 సీట్లు గెలుచుకొనే అవకాశం మాత్రమే ఉందని తేల్చి చెప్పాయి.
ఈసారి ఎన్నికలలో బిజెపి 1-2 స్థానాలు గెలుచుకొంటే చాలా గొప్ప విషయమని కేసీఆర్ పదేపదే చెప్పారు. ఆలెక్కన సర్వేలను చూస్తే బిజెపి పరిస్థితి కాస్త మెరుగుపడిందని స్పష్టం అవుతోంది. కనుక రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాలేకపోయినా పార్టీ పరిస్థితి మెరుగుపడినందుకు దత్తన్న సంతోషించవచ్చు.