సంబంధిత వార్తలు

సూర్యాపేట జిల్లాలో తిరుమలగిరి పరిధిలో గల బీసీ కాలనీలో ఏర్పాటు చేసిన 213/96వ నెంబరు పోలింగ్ బూత్ అధికారి, సిబ్బంది మధ్యాహ్నం ఒంటి గంట అవడంతో భోజనం చేసి వస్తామంటూ పోలింగ్ బూత్‌కు తాళం వేసి వెళ్ళడంతో ఓట్లు వేయడానికి వచ్చిన ప్రజలు ఆశ్చర్యపోయారు. కొందరు యువకులు తాళం వేసిన ఆ పోలింగ్ బూత్‌కు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ విషయం ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా పాకిపోయింది. ఈ విషయం తెలుసుకొన్న జిల్లా ఎన్నికల అధికారి వారిని గట్టిగా హెచ్చరించడంతో వారు హడావుడిగా వెనక్కు వచ్చి పోలింగ్ బూత్ తాళం తీసి మళ్ళీ పోలింగ్ కార్యక్రమం చేపట్టారు.