జోరుగా హుషారుగా పోలింగ్

రాష్ట్రంలో చాలా జోరుగా ప్రశాంతంగా పోలింగ్ సాగుతోంది. ఉదయం 11 గంటలకు సుమారు 24 శాతం పోలింగ్ జరిగింది. పోలింగ్ శాతం ఇంకా పెరిగి ఉండేది కానీ అనేక చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా మొదలైంది. కొన్ని పోలింగ్‌ బూత్‌లలో ట్యూబ్ లైట్స్ ఏర్పాటు చేయకపోవడంతో చీకటి అలుముకొంది. ఆ చీకటిలోనే సెల్ ఫోన్ వెలుగులో పోలింగ్ కొనసాగిస్తుండటంతో ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చీకటిలో ఎవరికి ఓటు వేస్తున్నామో కూడా తెలియనిస్థితిలో ఓట్లు వేయవలసివస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం ఎసారి చాలా విస్తృతమైన ఏర్పాట్లు, సౌకర్యాలు చేసినప్పటికీ ఇటువంటి లోపాల వలన పోలింగ్ శాతం కాస్త తగ్గింది. ఉదయం 11 గంటల వరకు వివిద జిల్లాలలో పోలింగ్ శాతం ఈవిధంగా ఉంది: 

అత్యధికం: వరంగల్: 22 శాతం 

అత్యల్పం: పెద్దపల్లి: 8 శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది. 


• హైదరాబాద్‌: 12శాతం

• రంగారెడ్డి జిల్లాలో15శాతం 

• మెదక్‌ జిల్లాలో 31శాతం 

• వరంగల్‌ జిల్లాలో 23శాతం 

• నల్గొండ జిల్లాలో 18శాతం 

• ఖమ్మం జిల్లాలో 18.5శాతం 

• కరీంనగర్‌ జిల్లాలో 21శాతం 

•నిజామాబాద్‌ జిల్లాలో 18శాతం 

• మహబూబ్‌నగర్‌ జిల్లాలో 11శాతం

•  ఆదిలాబాద్‌ జిల్లాలో 20శాతం 

• భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10శాతం 

•  జనగామ జిల్లాలో 17శాతం 

•  సిద్దిపేట జిల్లాలో 11శాతం 

• కామారెడ్డి జిల్లాలో 27.32శాతం 

• కుమ్రం భీం జిల్లాలో 9శాతం 

• పెద్దపల్లి జిల్లాలో 8శాతం 

• జగిత్యాల జిల్లాలో 23శాతం 

• మహబూబ్‌నగర్‌ జిల్లాలో 14శాతం 

• సిరిసిల్ల జిల్లాలో 26శాతం