మోత్కుపల్లికి తీవ్ర అస్వస్థత...సానుభూతి కోసం కాదు కదా?

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నుంచి బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌) అభ్యర్థిగా పోటీ చేస్తున్న మోత్కుపల్లి నర్సింహులు ఈరోజు ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆయన బీపీ డౌన్ అవడంతో అస్వస్థతకు లోనైనట్లు సమాచారం. ఎన్నికల సమయంలో అభ్యర్ధులు వారి సన్నిహితులు తీవ్ర ఒత్తిడికి లోనవడం సహజమే. కనుక ఆఖరిపోరాటం చేస్తున్న మోత్కుపల్లి కూడా తీవ్ర ఒత్తిడికి గురవడం సహజమే. అయితే ఆయన నిజంగానే ఆసుపత్రిలో చేరవలసినంత తీవ్ర అస్వస్థతకు గురయ్యారా లేక ఓటర్ల సానుభూతి పొందాలనే ఆలోచనతో చేరారా? అనేది నిలకడ మీద తెలుస్తుంది.