తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ ను మరింత అభివృద్ది చేస్తామని, ఆ బాధ్యత తనదే అని జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని పాటిస్తూ.. ఏకంగా అర్దరాత్రి తనిఖీలు నిర్వహించారు. ఇప్పటికే హరితహారం అనే కార్యక్రమాన్ని హైదరాబాద్ లో 25లక్షల మొక్కలతో ఎవరూ ఊహించని విధంగా సక్సెస్ చేశారు. దీనిపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపించారు. నిజానికి ఇది కేటీఆర్ ఆలోచననే అని అందరూ మాట్లాడుకుంటున్నారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్ మంగళవారం అర్దరాత్రి రోడ్డు మీదకొచ్చారు. కూకట్ పల్లి పరిధిలో జరుగుతున్న రోడ్ల పనులను పరిశీలించారు. సాక్షాత్తు కేటీఆర్ రోడ్డు పనుల పర్యవేక్షణకు అర్దరాత్రి బయలుదేరి రావడంతో జీహెచ్ఎంసీ అధికారులు హైరానా పడ్డారు. అప్పటికప్పుడు అక్కడికి ఉరుకులు పరుగులు పెట్టారు. ఇవేమీ పట్టించుకోని కేటీఆర్... పనులు జరుగుతున్న ప్రదేశంలో కనీస బాధ్యతలను విస్మరించిన కింది స్థాయి ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు లోపిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. అర్ధరాత్రి సమయంలో రోడ్డు మీదకు వచ్చిన కేటీఆర్ చాలా సేపు పనులను పరిశీలించిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.