రేవంత్‌రెడ్డిపై ఏమి చర్యలు తీసుకొన్నారు? ఈసి

కొడంగల్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధి రేవంత్‌రెడ్డిపై తెరాస నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మొన్న శనివారం రాత్రి ఆయన తన అనుచరులతో కలిసి కొడంగల్‌లో రోడ్లపై బైటాయించి ఆ నియోజకవర్గంలో ప్రజలను   భయాందోళనలు సృష్టించారని ఫిర్యాదు చేశారు. అలాగే మంగళవారం కొడంగల్‌లో జరుగబోయే సిఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచారసభను అడ్డుకోవాలని, ఆరోజు కొడంగల్‌ బంద్ కు పిలుపునిచ్చారని, ఇది ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడమేనాని కనుక ఆయనపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తెరాస నేతలు ఎన్నికల సంఘం ప్రధానాదికారి రజత్‌కుమార్‌కు  ఫిర్యాదు చేశారు. దీనికి సంబందించి రేవంత్‌రెడ్డి చేసిన ప్రసంగాలు, రోడ్లపై బైటాయించిన వీడియో క్లిప్పింగ్స్ వారు రజత్‌కుమార్‌కు సమర్పించారు. 

వారి పిర్యాదుపై స్పందించిన రజత్‌కుమార్‌ ఈ ఘటనలపై ఎటువంటి చర్యలు తీసుకొన్నారో సోమవారంలోగా తెలియజేయాలని ఇవ్వాలని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డిని కోరారు.