విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న తెలంగాణవాసులు రాష్ట్రంలో ఇంత కోలాహలం జరుగుతుంటే ప్రత్యక్షంగా దానిలో పాల్గొనలేకపోయినప్పటికీ ప్రసార మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను చాలా ఆసక్తితో గమనిస్తున్నారు. ఈ సందర్భంగా వారు తమతమ అభిమాన పార్టీల తరపున తమ నియోజకవర్గాలలో పోటీ చేస్తున్న అభ్యర్ధులకు సంఘీభావం ప్రకటిస్తూ మెసేజులు, వీడియో ఫుటేజీలు పంపిస్తున్నాయి. మలేషియాలో ఎన్.ఆర్.ఐ.లలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ యువసేన ఇబ్రహీంపట్నం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మల్ రెడ్డి రంగారెడ్డికి తమ మద్దతు తెలుపుతూ ఒక వీడియోను విడుదల చేశాయి.
పదవులున్నా లేకపోయినా ఎల్లప్పుడూ ప్రజల మద్యే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న మల్ రెడ్డి రంగారెడ్డికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని ఒక సందేశం ద్వారా తెలిపారు. డిసెంబరు 7న జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఆయన భారీ మెజార్టీతో విజయం సాధించి, నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నట్లు ఆ సందేశంలో తెలిపారు. కొంతమంది ఎన్.ఆర్.ఐ.లు మల్ రెడ్డి రంగారెడ్డి మీద అభిమానంతో తమ ఉద్యోగాలకు శలవు పెట్టుకొని భారత్ వచ్చి ఎన్నికల ప్రచారంలో ఆయనకు తమ సహాయసహకారాలు అందజేస్తుండటం విశేషం.