హైదరాబాద్‌ ఓటర్ల జాబితాలో రోహింగ్యాలు!

కొన్ని నెలల క్రితం బంగ్లాదేశ్ మీదుగా భారీ సంఖ్యలో భారత్ లోకి ప్రవేశించిన రోహింగ్యా శరణార్డులు దేశంలో వివిద రాష్ట్రాలకు చేరుకొని భారత పౌరులుగా ఆధార్, రేషన్, ఓటరు కార్డులు సంపాదించుకొన్నట్లు మీడియాలో అప్పుడప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. దేశంలోని కొన్ని రాజకీయపార్టీలు, వాటి నేతలు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజానల కోసం వారికి అన్నివిధాలా సహకరించడంతో ఇది సాధ్యపడినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో కూడా ఒక ప్రాంతీయ పార్టీ వారికి ఆధార్, రేషన్, ఓటరు కార్డులు వచ్చేందుకు అన్ని విధాలా సహకరించిందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజమేనని బిజెపి నేతలు వాదిస్తున్నారు.  

బిజెపి జనరల్‌ సెక్రటరీ అరుణ్‌ సింగ్, పార్టీ జాతీయ మీడియా హెడ్‌ అనీల్‌ బాలు, కేంద్ర సహాయమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ బుదవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్‌కుమార్‌ను కలిసి గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో 15 నియోజకవర్గాలలో వేలాదిమంది రోహింగ్యాలను ఓటర్లుగా నమోదయ్యారని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మజ్లీస్, తెరాస, కాంగ్రెస్ పార్టీలు వారికి తోడ్పడ్డాయని వారు ఫిర్యాదు చేశారు. కనుక తక్షణమే ఓటర్ల జాబితాలో నుంచి రోహింగ్యాలను తొలగించాలని కేంద్రసహాయమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ డిమాండ్ చేశారు.