3 లక్షల కోట్లు ఇస్తే 2 లక్షల కోట్లు అప్పులు చేశారు: అమిత్ షా

బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదివారం వరంగల్ జిల్లా పరకాలలో ఆ తరువాత నిర్మల్ జిల్లా విశ్వనాధ్ పేటలో బహిరంగసభలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఈ నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సుమారు రూ.1.25 లక్షల కోట్లు ఇచ్చింది. అదీగాక అధనంగా రోడ్లు, వంతెనలు, ఆసుపత్రులు వగైరా నిర్మాణాల కోసం మరో రూ.1.50 లక్షల కోట్లు ఇచ్చింది. మేము సుమారు రూ. 3 లక్షల కోట్లు ఇచ్చినప్పటికీ కేసీఆర్‌ రూ.2 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఇదే మొత్తం మరో రాష్ట్రానికి అండిఉండి ఉంటే ఆ రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి చెంది ఉండేది. కానీ కేసీఆర్‌ మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలోకి కూరుకుపోయేలా చేసేరు,” అని విమర్శించారు.