బరిలో నుంచి తప్పుకొన్న రెబెల్స్

కాంగ్రెస్‌, తెరాస పార్టీలలో రెబెల్స్ గా నామినేషన్లు వేసినవారిని బుజ్జగించడానికి చేసిన ప్రయత్నాలు చాలా వరకు ఫలించాయి. కనుక ఇవాళ్ళ చాలా మంది రెబెల్ అభ్యర్ధులు తమ నామినేషన్లు ఉపసంహరించుకొన్నారు. కోదాడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన ప్రముఖ హాస్యనటుడు వేణు మాధవ్ కూడా ఇవాళ్ళ తన నామినేషన్ ఉపసంహరించుకొన్నారు.           

కాంగ్రెస్ పార్టీ: 

భిక్షపతి యాదవ్ (శేరిలింగంపల్లి), నాయిని రాజేందర్ రెడ్డి (వరంగల్ పశ్చిమ), పడాల వెంకటస్వామి (చేవెళ్ళ), సుబాష్ రెడ్డి (ఎల్లారెడ్డి), మాల్యాద్రి రెడ్డి (బాన్సువాడ), జంగమయ్య యాదవ్ (మేడ్చల్), ఏ అమరేందర్ రెడ్డి (మిర్యాలగూడ) తమ నామినేషన్లు ఉపసంహరించుకొన్నారు. 

టిడిపి: మువ్వ సత్యనారాయణ (శేరిలింగంపల్లి)

తెరాస: శంకర్ గౌడ్, మరో ఐదుగురు రెబెల్స్ (శేరిలింగంపల్లి), శశిధర్ రెడ్డి (కోదాడ), హనుమంత రెడ్డి (కుత్బుల్లా పూర్) తదితరులు తమ నామినేషన్లు ఉపసంహరించుకొన్నారు.