సంబంధిత వార్తలు

మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ నిర్మల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి రాకుండా ఉంటే, రూ.25 లక్షలు ఇస్తానని అక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మహేశ్వర్ రెడ్డి (అనుచరుడు) చెప్పారని అన్నారు. దానిపై మహేశ్వర్ రెడ్డి స్పందిస్తూ, “నాకు అంతా ఖర్మ పట్టలేదు. తెరాసకు ఓటేస్తే బిజెపికి ఓటేసినట్లే కనుక నిర్మల్‌లో మైనార్టీలు అందరూ కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తున్నారు. మైనార్టీలను తనవైపు తిప్పుకోవడానికే అసదుద్దీన్ ఓవైసీ చేత మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ లో బహిరంగసభ ఏర్పాటు చేయించారు. అసదుద్దీన్ ఓవైసీ నాపై చేసిన ఆరోపణలు నిరోపిస్తే నేను దేనికైనా సిద్దమే,” అని సవాలు విసిరారు.