కాంగ్రెస్‌ 3వ జాబితా విడుదల

కాంగ్రెస్ అధిష్టానం కొద్ది సేపటి క్రితమే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 13 మందితో కూడిన 3వ జాబితాను విడుదల చేసింది. దీంతో కలిపి మొత్తం 88 మంది అభ్యర్ధులను ఖరారు చేసినట్లయింది. నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ముగియబోతోంది కనుక ఆలోగా మిగిలిన 6 మంది అభ్యర్ధుల పేర్లను కూడా ప్రకటించవలసి ఉంటుంది. టిడిపి కూడా సనత్ నగర్ నియోజకవర్గానికి కూన వెంకటేష్ గౌడ్ ను అభ్యర్ధిగా ప్రకటించింది   ఈరోజు ప్రకటించిన అభ్యర్ధుల వివరాలు: 

జనగామ: పొన్నాల లక్ష్మయ్య

తుంగతుర్తి: అడ్డంకి దయాకర్  

ఎల్బీ నగర్: సుధీర్ రెడ్డి 

కార్వాన్: ఉస్మాన్ బిన్ హజారీ 

బహదూర్ పురా: కాలెం బాబా

 యాకుత్ పురా: రాజేందర్ రాజు 

కొల్లాపూర్: హర్షవర్ధన్ రెడ్డి 

దేవరకొండ: బాలూ నాయక్ 

బాల్కొండ: ఈర్రవతి అనిల్ కుమార్ 

నిజామాబాధ్ రూరల్: రేకుల భూపతి రెడ్డి

నిజామాబాద్‌ అర్బన్: తాహెర్ బిన్ హుందాన్ 

భోధ్: సోయమ్ బాపూరావు