
తెరాస 107 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించినప్పటికీ మిగిలిన 12 స్థానాలకు ఇంతవరకు పేర్లు ప్రకటించలేదు. మహాకూటమిలో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధుల జాబితాను ప్రకటిస్తే దానిని బట్టి మిగిలిన స్థానాలకు అభ్యర్ధులను ప్రకటిద్దామని సిఎం కేసీఆర్ ఇంతకాలం ఎదురుచూశారు. అయితే కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో కేవలం 65 మంది పేర్లనే ప్రకటించగా, తెలంగాణ జనసమితి నేడు 6 స్థానాలకు, సిపిఐ3 స్థానాలకు తమ అభ్యర్ధులను ప్రకటించబోతున్నాయి.
కాంగ్రెస్ రెండవ జాబితా మంగళవారం రాత్రి విడుదలవుతుందని భావించినప్పటికీ ప్రకటించలేదు. కనుక సిఎం కేసీఆర్ ఇవాళ్ళ మిగిలిన 12 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించబోతున్నట్లు తాజా సమాచారం.
ఈరోజు ఉదయం 11.23 గంటలకు ఆయన గజ్వేల్ లో నామినేషన్ వేస్తారు. ఆ కార్యక్రమం తరువాత తెరాస తుది జాబితా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. తెరాస తుది జాబితాలో అభ్యర్ధుల వివరాలు కూడా అప్పుడే బయటకు వచ్చాయి. అయితే తెరాస వాటిని దృవీకరించలేదు. తుది జాబితాలో అభ్యర్ధుల వివరాలు:
ఖైరతాబాద్: దానం నాగేందర్
గోషామహల్: ప్రేమ్ సింగ్ రాథోడ్
ఛార్మినార్: దీపాంకర్ పాల్
మల్కాజ్ గిరి: మైనంపల్లి హనుమంత రావు (ఎమ్మెల్సీ)
అంబర్ పేట: కాలేరు వెంకటేష్
మేడ్చల్: మల్లారెడ్డి (ఎంపీ)
ముషీరాబాద్: ముఠా గోపాల్
వరంగల్ తూర్పు: నన్నపూనేని నరేందర్ (మేయర్)
చొప్పదండి: రవి శంకర్ (తెరాస ఎస్సీ సెల్ అధ్యక్షుడు)
కోదాడ: వెనెపల్లి చందర్ రావు
హుజూర్ నగర్: శానంపూడి సైదిరెడ్డి
వికారాబాద్: ఆనంద్/ సబిత