పొన్నాలకు కాంగ్రెస్‌ హ్యాండ్?

మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు టికెట్ ఖరారు అయినట్లు రెండు రోజుల క్రితమే కె జానారెడ్డి చెప్పారు కానీ కాంగ్రెస్ పార్టీ సోమవారం రాత్రి విడుదల చేసిన తొలి జాబితాలో పొన్నాల లక్ష్మయ్య పేరు లేదు. పైగా ఆ సీటును టిజేఎస్ పార్టీకి కేటాయించారని, అక్కడి నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్‌ పోటీ చేయబోతున్నారని మీడియాలో వార్తలు వస్తుండటంతో పొన్నాల హడావుడిగా ఈరోజు ఉదయం డిల్లీ బయలుదేరి వెళ్లారు. మాజీ పిసిసి అధ్యక్షుడుగా చేసిన పొన్నాలకే టికెట్ లభించని పరిస్థితి ఉంటే ఇక గాంధీ భవన్‌ ముందు టికెట్ల కోసం ధర్నాలు చేస్తున్నవారి పరిస్థితి ఏమిటి? అనే సందేహం కలుగకమానదు.