
నేడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడంతో అభ్యర్ధులు నామినేషన్లు వేయడం మొదలుపెట్టారు. గత రెండు నెలలుగా సాగుతున్న తెరాస ఎన్నికల ప్రచారంతోనే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం కనబడటం మొదలైంది. ఇవాళ్ళ నుంచి అభ్యర్ధులు నామినేషన్లు వేయడం మొదలుపెట్టడంతో రాష్ట్రంలో పూర్తిగా ఎన్నికల వాతావరణం వచ్చేసింది.
ముందుగా బిజెపి నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ (ముషీరాబాద్), రాజా సింగ్ (ఘోషా మహల్) నామినేషన్లు దాఖలు చేశారు. ఇరువురూ భారీగా పార్టీ శ్రేణులతో కలిసి ఊరేగింపుగా వెళ్ళి తమ నామినేషన్లు దాఖలు చేశారు. బండారు దత్తాత్రేయ, మురళీధర్‌రావు, కిషన్‌రెడ్డి తదితరులు లక్ష్మణ్ కు మద్దతుగా నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారు.