సంబంధిత వార్తలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం ఉదయం నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఇవాళ్ళ మధ్యాహ్నం 11 గంటల నుంచి డిసెంబరు 19 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబరు 20వ తేదీన నామినేషన్లు పరిశీలిస్తారు. 22వతేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. డిసెంబరు 7వ తేదీన పోలింగ్ జరుగుతుంది. డిసెంబరు 11వ తేదీన తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘర్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాలలో కూడా ఒకేసారి ఓట్లు లెక్కించి అదే రోజున ఫలితాలు ప్రకటిస్తారు. అంటే సరిగ్గా మరో నెల రోజులలో 5 రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు కొలువవనున్నాయన్న మాట!