
తెరాస అభ్యర్ధులందరికీ రేపు (ఆదివారం) సాయంత్రం 4గంటలకు తెలంగాణభవన్‌లో సిఎం కేసీఆర్ బి-ఫారంలు సంతకాలు చేసి అందజేస్తారు. ఒకవేళ ఇవాళ్ళ సాయంత్రంలోగా మహాకూటమి తన అభ్యర్ధుల జాబితాలను విడుదల చేసినట్లయితే, తెరాస కూడా ఒకటి రెండు రోజులలోగా మిగిలిన 12మంది అభ్యర్ధుల పేర్లను ఖరారు చేసే అవకాశం ఉంది.
సిఎం కేసీఆర్ నవంబరు 14వ తేదీ ఉదయం సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండలంలోని కోనాయిపల్లి దేవాలయంలో పూజలు నిర్వహించిన తరువాత అక్కడి నుంచి నేరుగా గజ్వేల్ ఆర్.డి.ఓ. కార్యాలయం చేరుకొని మధ్యాహ్నం 11.23 గంటలకు తన నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. ఈనెల 12వ తేదీ నుంచి 19వరకు నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు ఉంది.