నేడు తెరాస మేనిఫెస్టో విడుదల?

సిఎం కేసీఆర్‌ మంగళవారం సాయంత్రం తెలంగాణభవన్‌లో తెరాస ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన తమ పార్టీ మేనిఫెస్టోలో కొన్ని ముఖ్యాంశాలను ప్రకటించారు. ఇప్పటివరకు తెరాస ప్రభుత్వం కొనసాగిస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అధనంగా మేనిఫెస్టోలో కొత్త అంశాలు ఏమి ఉంటాయో చూడాలి. తెరాస ఇప్పటికే 107మంది అభ్యర్ధుల పేర్లు ప్రకటించింది. ఈరోజు మరికొన్ని స్థానాలకు అభ్యర్ధుల పేర్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.