
టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ శనివారం ఉదయం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “మహాకూటమిలో మా పార్టీకి కేటాయించిన 14 స్థానాలలో రెండింటిని మైనార్టీ వర్గాలకు కేటాయించాలని నిర్ణయించాము. ఛార్మినార్ నుంచి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలీ మస్కతి, మలక్ పేట నుంచి మహ్మద్ ముజఫర్ అలీఖాన్‌కు టికెట్లు కేటాయించాలని నిర్ణయించాము. మహాకూటమిలో భాగస్వాములుగా ఉన్న మా నాలుగు పార్టీలు అభ్యర్ధుల జాబితాలను గురు లేదా శుక్రవారంనాడు విడుదల చేస్తాము,” అని చెప్పారు.
ఒకవేళ వారిద్దరూ పోటీ చేయడం ఖాయమనుకొంటే వారు ఛార్మినార్ నుంచి పోటీ చేస్తున్న టి.ఉమామహేంద్ర (బిజెపి), మలక్ పేట నుంచి ఆలె జితేంద్ర (బిజెపి)ను ఎదుర్కోవలసి ఉంటుంది. ఎల్ రమణ ప్రకటించిన ఇద్దరు మహాకూటమి తరపు అభ్యర్ధులు కనుక, ఆ రెండు స్థానాలకు తెరాస కూడా తన అభ్యర్ధులను ఇక ప్రకటించవచ్చు.