
తెలంగాణ బిజెపి ఇప్పటికే శాసనసభ ఎన్నికలకు 38 మందితో కూడిన మొదటి జాబితాను ప్రకటించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ రేపు రెండవ జాబితాతో డిల్లీ వెళ్లబోతున్నట్లు సమాచారం. కనుక రేపు లేదా ఎల్లుండిలోగా మరికొంతమంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించే అవకాశం ఉందని భావించవచ్చు. నవంబరు నెలలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి రాబోతున్నారు. లక్ష్మణ్ డిల్లీలో ఉన్నప్పుడే కనుక ప్రధాని పర్యటన షెడ్యూల్ కూడా ఖరారు కావచ్చు. ఎన్నికలకు కేవలం 37 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి కనుక రాష్ట్రంలో కేంద్రమంత్రులు, బిజెపి జాతీయ నేతలు కూడా ఎన్నికల ప్రచారానికి వస్తారు కనుక అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడానికి వీలుగా వారి పర్యటన షెడ్యూల్స్ కూడా ఖారరయ్యే అవకాశం ఉంది.