.jpg)
కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డికి రాష్ట్రంలో సిఎం కేసీఆర్ తరువాత అధికార, ప్రతిపక్షపార్టీల నేతలు ఎవరికీ దక్కని ప్రత్యేక భద్రత త్వరలో లభించబోతోంది. అధికార తెరాసతో తనకు రాజకీయ శతృత్వం ఉంది కనుక తనకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పోలీసులతో కల్పిస్తున్న భద్రతపై నమ్మకం లేదని, తనకు తన రాజకీయ శత్రువుల నుంచి ప్రాణహాని ఉన్నందున కేంద్రబలగాలతో 4+4 భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రేవంత్‌రెడ్డి హైకోర్టులో ఒక పిటిషను వేశారు. దానిపై హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది.
అనంతరం రేవంత్‌రెడ్డి కోరిన విధంగా 4+4 స్థాయి భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే దీనికయ్యే ఖర్చును రేవంత్‌రెడ్డే భరించాలని కోర్టు స్పష్టం చేసింది. అందుకు రేవంత్‌రెడ్డి అంగీకరించినందున త్వరలోనే ఆయనకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయనుంది. దీంతో రేవంత్‌రెడ్డి రక్షణ భాద్యత ఇక రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర పోలీసులకు లేనట్లే భావించ చెప్పవచ్చు.