
త్వరలో జరుగనున్న ఎన్నికలలో తెరాసను డ్డీకొనడానికి సిద్దపడుతున్న మహాకూటమి నేతలు తెరాస ప్రభుత్వంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, టీజేఎస్ నేత కె.దిలీప్‌కుమార్ తదితరులు గురువారం రజత్‌కుమార్‌ను కలిసి తెరాస ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాపింగ్ చేయిస్తూ గూడచర్యానికి పాల్పడుతోందని లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు. ప్రస్తుతం ఆపద్ధర్మంగా అధికారంలో ఉన్న తెరాస, కొందరు పోలీస్ అధికారుల సహకారంతో తనికీల పేరుతో తమను వేధింపులకు గురి చేస్తోందని, తమ కదలికలపై ప్రభుత్వం నిఘా పెట్టించిందని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం తమను తప్పుడు కేసులలో ఇరికించడానికి ప్రయత్నిస్తోందని ఫిర్యాదు చేశారు. వారి పిర్యాదుపై స్పందించిన రజత్‌కుమార్ వెంటనే డీజీపీ మహేందర్‌రెడ్డిని వివరణ ఇవ్వవలసిందిగా కోరారు.