
తెలంగాణ జనసమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ పార్టీ నేతలకు తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యాంశాలను వివరించారు. ఆ వివరాలు:
1. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేవిధంగా నిర్ణయాలు అమలు.
2. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ.
3. ధర్నాచౌక్ పునరుద్దరణ.
4. హైకోర్టు ఏర్పాటుకు కృషి.
5. ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతానికి కృషి.
6. రూ.2 లక్షలు వ్యవసాయ రుణమాఫీ.
7. మద్యం గొలుసు దుఖానాలను బంద్ చేస్తాం.
8. ఒప్పంద ఉద్యోగులు అందరికీ సమానవేతనాలు కల్పిస్తాం.
9. ఉద్యమకారులకు పింఛన్లు ఇస్తాం. ప్రభుత్వ పధకాల వర్తింపు చేస్తాం.
10. అధికారంలోకి వచ్చిన 100 రోజులలోపు ఉద్యమకారులపై కేసులన్నిటినీ ఉపసంహరిస్తాం.
11. మొదటి సంవత్సరంలో లక్ష ప్రభుత్వోద్యోగాలను భర్తీ చేస్తాం.
12. ఏడాదిలోగా అమరవీరుల స్తూపం నిర్మాణం.
13. ప్రాజెక్టు పనులలో స్థానిక గుత్తేదారులకే తొలి ప్రాధాన్యత.
14. తెరాస హయాంలో మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులపై సమీక్షిస్తాము.