1.jpg)
కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన మహాకూటమిలో భాగస్వామ్యపార్టీల మద్య సీట్ల సర్దుబాట్లపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తాజా సమాచారం. దాని ప్రకారం మొత్తం 119 స్థానాలలో కాంగ్రెస్-90, టిడిపి-15, టిజేఎస్-10, సిపిఐ-4 స్థానాలలో పోటీ చేయడానికి అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏ స్థానం నుంచి ఏ పార్టీ పోటీ చేయాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. దానిపై కూడా ఒకటి రెండు రోజులలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది కనుక త్వరలోనే మహాకూటమి నేతలు దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
తాజా సమాచారం ప్రకారం ఈనెల 27వ తేదీన మహాకూటమి తరపున పోటీ చేయబోతున్న 60 మంది అభ్యర్ధుల జాబితాను విడుదల చేయవచ్చని తెలుస్తోంది. దానిలో కాంగ్రెస్-40-50 మంది, టిడిపి-8, టిజేఎస్-5, సిపిఐ-2 అభ్యర్ధుల పేర్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నవంబరు మొదటి వారంలోగా మిగిలిన 59 మంది అభ్యర్ధుల పేర్లను కూడా ప్రకటించబోతున్నట్లు సమాచారం. మహాకూటమి అభ్యర్ధులలో 30-35 శాతం టికెట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది.