
సిబిఐ తాత్కాలిక డైరెక్టరుగా తెలంగాణకు చెందిన మన్నెం నాగేశ్వరరావు నియమితులయ్యారు. సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా మద్య మొదలైన వర్గపోరు పతాకస్థాయికి చేరుకోవడంతో దాని వలన సిబిఐ ప్రతిష్ట మసకబారుతోందని భావించిన ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం రాత్రి సిబిఐ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. వారిరువురినీ శలవులో పంపించి, సిబిఐ తాత్కాలిక డైరెక్టరుగా మన్నెం నాగేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించాలని ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయించారు. అధికారుల నియమకాలు, వాటికి సంబందించిన వ్యవహారాలను చూసే డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డిఓపిటి) మంగళవారం రాత్రి సిబిఐ డైరెక్టరుగా మన్నెం నాగేశ్వరరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మన్నెం నాగేశ్వరరావు వరంగల్ జిల్లా మండపేట మండలంలో బోర్ నర్సాపూర్ గ్రామానికి చెందినవారు. అయన 1986 బ్యాచ్‌కు చెందిన ఒడిశా కేడర్ అధికారి.