తెలంగాణ బాటలోనే ఏపీ! అందుకే...

తెలంగాణ రాజకీయాలు, పరిపాలనలో సిఎం కేసీఆర్‌ అవలంభిస్తున్న వినూత్నమైన విధానాలు, ఆలోచనలను ఏపీ ప్రభుత్వం కూడా గుడ్డిగా ఫాలో అయిపోతున్నట్లుంది. అందుకే తెరాస ప్రభుత్వానికి హైకోర్టులో మొట్టికాయలు పడితే ఏపీ ప్రభుత్వానికి కోర్టులో మొట్టికాయలు పడుతూనే ఉన్నాయి. 

ఉదాహరణకు గ్రామాపంచాయితీ ఎన్నికల నిర్వహించకుండా స్పెషల్ ఆఫీసర్లతో పాలన సాగిస్తున్న తెరాస ప్రభుత్వానికి కొన్ని రోజుల క్రితమే హైకోర్టులో మొట్టికాయలు పడ్డాయి. ఈవిషయంలో తెలంగాణ ప్రభుత్వాన్నే ఆధార్శంగా తీసుకొని జీవో నెంబర్ 90 ద్వారా  స్పెషల్ ఆఫీసర్లను నియమించుకొన్న ఏపీ ప్రభుత్వానికి కూడా ఈరోజు హైకోర్టులో మొట్టికాయలు పడ్డాయి. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 90ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషనుపై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు ఆ జీవోను కొట్టివేసింది. తెలంగాణ ప్రభుత్వానికి సూచించినట్లుగానే వీలైనంత త్వరగా బీసీ ఓటర్ల జాబితాలు సిద్దం చేసి మూడు నెలలోగా గ్రామ పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.