అవును.. మొన్నటి ఎన్నికల వరకు కూడా హైదరాబాద్ వాసులుగా ఓటు హక్కును వాడుకున్న ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ లు ఇప్పుడు తెలంగాణ ఓటర్లు కాదు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓటర్లు. ఏపీలో చేపట్టని స్మార్ట్ పల్స్ సర్వేలో సీఎం అధికారిక ఇంటి అడ్రస్ తోనే ఇద్దరూ తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దానితో పాటు తమ ఓటును ఆన్ లైన్ లో వెంటనే తెలంగాణ నుండి ఏపీకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఇక ఇతరత్రా పనుల వల్ల భువనేశ్వరి, బ్రహ్మణి, తన మనవడు రాలేకపోయారని, మరోసారి వాళ్లు వివరాలిస్తారని చెప్పారు.
ఇక చంద్రబాబు ఆదాయం 36 లక్షలుగా నమోదు చేశారు. ఇవి కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు ఇతర బ్యాంక్ ఖాతాల వివరాలను కూడా ఇచ్చారు. ఐరిస్ ద్వారా తమ వివరాలిచ్చి ఫోన్ లు, టీవీలు, కార్ ల డీటెయిల్స్ ను కూడా తెలిపారు. ఇక లోకేష్ బ్యాంక్ ఎకౌంట్ తో పాటు ఆదాయ వివరాలను కూడా ఇచ్చారు. కానీ అతని వివరాలను అధికారులు చూపించకపోవడం గమనర్హం.