సంబంధిత వార్తలు

తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మన్, తెరాస మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన బుదవారం ఇల్లంతకుంట మండలంలోని ముస్కాన్ పేటలో జరుగుతున్నా బతుకమ్మ వేడుకలకు హాజరయ్యేందుకు రాగా, స్థానిక యువకులు ‘రసమయి గో బ్యాక్’ అంటూ నినాదాలు చేస్తూ ఆయనను అడ్డుకొన్నారు. తమ గ్రామంలో డాక్టర్ అంబేడ్కర్, జ్యోతీరావుఫూలే విగ్రహాలను ఆవిష్కరించడానికి ఆహ్వానించినప్పుడు రాకుండా మొహం చాటేసి ఇప్పుడు ఎందుకు వచ్చారని వారు రసమయి బాలకిషన్‌ను నీలదీశారు. ఆయన వారికి ఎంతగా నచ్చజెప్పినా వినకపోవడంతో ఇక చేసేదేమీ లేక వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు.