5.jpg)
కాంగ్రెస్ నేతృత్వంలో టిడిపి, టిజెఎస్, సిపిఐ పార్టీలతో ఏర్పాటవుతున్న మహాకూటమికి ‘తెలంగాణ పరిరక్షణ వేదిక’అని పేరు నిర్ణయించినట్లు తాజా సమాచారం. దానికి టిజెఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఈరోజు జరుగబోయే మహాకూటమి సమావేశంలో దీనిపై చర్చించి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
ఒకవేళ ఆయన తెలంగాణ పరిరక్షణ వేదికకు నాయకత్వం వహించడానికి ఒప్పుకొన్నట్లయితే ఎన్నికలలో పోటీ చేయకుండా కేవలం ప్రచారానికే పరిమితం కావచ్చు. ఎన్నికలలో తెలంగాణ పరిరక్షణ వేదిక విజయం సాధించినట్లయితే, ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆయన దానికి మార్గదర్శనం చేయాలని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరినట్లు సమాచారం. ఆయన తెలంగాణ పరిరక్షణ వేదికకు నాయకత్వం వహించదానికి అంగీకరిస్తే సీట్ల సర్దుబాట్ల బాధ్యత కూడా ఆయనకే అప్పగించవచ్చని తెలుస్తోంది.
అయితే ఈ ఎన్నికలలో పోటీ చేసి శాసనసభలో అడుగుపెట్టాలని భావిస్తున్న కోదండరాం కాంగ్రెస్ నేతల ఈ ప్రతిపాదనలకు అంగీకరిస్తారో లేదో త్వరలోనే తెలుస్తుంది.