నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఈరోజు తెలంగాణా శాసనసభ రద్దు కాబోతుండగా నేటి నుంచే ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు మొదలవబోతున్నాయి. ఈరోజు ఉదయం 8.15 గంటలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశమయ్యింది. ఈ సమావేశంలో మొత్తం ఏడు రోజులు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం ఉదయం 9.15 గంటలకు శాసనసభ సమావేశాలు మొదలయ్యాయి. మొదటిరోజు సమావేశంలో ఇటీవల మృతి చెందిన మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్ పేయి,  లోక్ సభ మాజీ స్పీకర్ సోమనాధ్ చటర్జీ, నందమూరి హరికృష్ణలకు సంతాపం తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదిస్తారు.