సమైఖ్య రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా బలంగా తెలంగాణ వాదాన్ని వినిపించిన కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ కవిత తాజాగా ఆంధ్రా నినాదం చెయ్యడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అదేంటి పచ్చి తెలంగాణ వాదులుగా ముద్ర వేసుకున్న కేసీఆర్ కుటుంబానికి చెందిన వ్యక్తిగా కవిత ఇలా జై ఆంధ్రా అని అనడం ఏంటా అని చాలా మంది చర్చించుకుంటున్నారు. మరికొంత మంది మాత్రం అందులో తప్పేలేదులే అని ఆమె వ్యాఖ్యలను వెనకేసుకొస్తున్నారు. ఇంతకీ కవిత అలా ఎందుకు..? ఎప్పుడు అన్నారో తెలుసా.?
చికాగోలో నిర్వహించిన ఆటా(అమెరికా తెలుగు ఆసోసియేషన్) సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న కవిత, అక్కడ ప్రసంగించిన సందర్భంలో ఈ నినాదం చేశారు. రాష్ట్రాలుగా, పరిపాలనపరంగా విడిపోయినప్పటికీ తెలుగువారంతా కలిసి ఉండాలని కోరుకుంటున్నట్టు ఆమె ఆకాంక్షించారు. ఆ తర్వాత ‘జై తెలంగాణ’, ‘జై ఆంధ్రా’, ‘జై హింద్’ అనే నినాదాలతో ఆమె తన ప్రసంగాన్ని ముగించడం విశేషం.