ఎన్ఐఎ అదుపులోకి తీసుకున్న 11 మంది ఐఎస్ సానుభూతిపరుల నుండి అధికారులు దాడులకు సంబంధించిన వివరాలను రాబట్టారు. హైదరాబాద్ లో భారీ పేలుళ్లతో పాటుగా మత ఘర్షణకు కూడా టెర్రరిస్టులు ప్లాన్ వేస్తున్నట్లు తేలింది. వీకెండ్ లో వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో దాడులకు పాల్పడటం, గుడులను టార్గెట్ గా చేసి వాటిలో ఆవు మాంసం పడెయ్యడం లాంటివి చెయ్యడం ద్వారా మత ఘర్షణలు సృష్టించాలని టెర్రిరిస్టులు పన్నాగం పన్నినట్లు తెలిసింది. ఈ శనివారం రోజే తమ దాడులకు వాళ్లు కుట్రపన్నారని, అంతలో ఎన్ఐఎ అధికారులు వారిని పట్టుకున్నారని పోలీసులు వెల్లడించారు.
చార్మినార్ను ఆనుకుని ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయాన్ని మొదటి టార్గెట్గా పెట్టుకున్న ఇబ్రహీం గ్యాంగ్.. సికింద్రాబాద్ లోని గణపతి దేవాలయం, ఆల్ఫాకేఫ్లను రెండో టార్గెట్గా, మాదాపూర్ ఐటీ క్యారిడార్లోని ఇనార్బిట్మాల్ను మూడవ టార్గెట్గా ఎంచుకున్నదని విచారణలో తేలినట్టు ఎన్ఐఏ వర్గాలద్వారా తెలిసింది. 15 చోట్ల రెక్కీ నిర్వహించి.. వీటిని ఖరారు చేశారని, వీటితోపాటే ఒక పోలీస్ స్టేషన్ను కూడా సమూలంగా పేల్చివేయాలని టార్గెట్ పెట్టుకున్నారని సమాచారం.