ఆర్టీసి సమ్మె విరమణ

ఈరోజు అర్ధరాత్రి నుంచి ప్రారంభం కావలసిన టీస్ఆర్టీసి సమ్మెను విరమించుకుంటున్నట్లు టి.ఎం.యు. కార్మిక సంఘం అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి ఆదివారం సాయంత్రం ప్రకటించారు. ఈరోజు మంత్రుల కమిటీ-టి.ఎం.యు.కార్మిక సంఘం నేతలకు మధ్య జరిగిన చర్చలలో 16 శాతం మధ్యంతర బృతికి అంగీకారం కుదిరింది. జూలై 1వ తేదీ నుంచి ఇది అమలులోకి వస్తుంది. కనుక ముఖ్యమంత్రి కెసిఆర్ మాటపై నమ్మకముంచి సమ్మె విరమిస్తున్నామని అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ప్రస్తుతానికి ఇది తాత్కాలిక ఉపశమనంగా మాత్రమే భావిస్తున్నామని, ముఖ్యమంత్రి సూచించిన విధంగా ఆర్టీసి లాభాల బాట పట్టేందుకు అవసరమైన సంస్కరణలు చేపట్టిన తరువాత, తాము ఆశిస్తునంత ఫిట్ మెంట్ తప్పక లభిస్తుందని భావిస్తున్నామని అన్నారు. ఆర్టీసిని లాభాలబాట పట్టడానికి తాము ప్రభుత్వానికి పూర్తి సహకారం అందజేస్తామని అశ్వత్థామరెడ్డి అన్నారు.