రాహుల్ గాంధీకి పెళ్ళి?

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలో రాయ్ బరేలీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అదితి సింగ్ ను పెళ్ళి చేసుకోబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొన్ని రోజుల క్రితమే సోనియా గాంధీ, ప్రియాంక, రాబర్ట్ వాద్రా సమక్షంలో వారి వివాహనిశ్చితార్ధం కూడా జరిగిందని చెపుతూ వారిరువురి ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. వారిరువురూ వివాహం చేసుకోబోతున్నట్లు రాబర్ట్ వాద్రా ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇది నిజమేనా?అంటే కాదని అదితి సింగ్ స్వయంగా ట్వీట్ చేశారు. 

“గత కొన్ని రోజులుగా మా వివాహం గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా పుకార్లే. అవి నిజం కావు. వాటిని చూసి నేను చాలా బాధపడుతున్నాను. రాహుల్ గాంధీ మా పార్టీ అధ్యక్షుడు మాత్రమే కాదు నాకు పెద్దన్న వంటివారు. కనుక నేను అయనను చాలా గౌరవిస్తాను. అయన నాకు రాఖీ సోదరుడు. అటువంటి వ్యక్తితో నాకు వివాహం జరుగుతోందని పుకార్లు పుట్టించడం నాకు చాలా బాధ కలిగిస్తోంది. దీనిని నేను ఖండిస్తున్నాను. దయచేసి ఇటువంటి పుకార్లు వ్యాపింపజేయవద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అదితి సింగ్ ట్వీట్ చేశారు. 

ఇవిగో ఆమె ట్వీట్స్: