రైల్లో ప్రయాణించబోతున్నారా?

రైల్లో ప్రయాణించబోతున్నారా?అయితే ఇది మీ కోసమే. మీరు స్లీపర్ క్లాసులో ప్రయాణిస్తున్నట్లయితే 40 కేజీలు, అదే ఏసిలో ప్రయాణిస్తున్నట్లయితే 30 కేజీలు లగేజి మాత్రమే తీసుకువెళ్ళండి. అంతకుమించి తీసుకువెళితే టికెట్ ధరకు ఆరు రెట్లు జరిమానా చెల్లించవలసివస్తుంది. నిజానికి లగేజీ పరిమితులపై ఎప్పటి నుంచో నిబంధనలు ఉన్నప్పటికీ, భారతీయుల పద్దతులు, అలవాట్లను దృష్టిలో ఉంచుకొని రైల్వేశాఖ ప్రయాణికుల లగేజీపై పరిమితులు విధించకుండా ఉపేక్షిస్తోంది. కానీ ఆదాయం పెంచుకునేందుకు ఇదీ ఒక మంచి మార్గమని గుర్తించిన రైల్వేశాఖ త్వరలోనే లగేజి పరిమితి, అదనపు లగేజికి జరిమానాల విధానాన్ని అమలు చేయబోతోంది. ప్రజలకు మేలు కలిగించే నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వం చాలా సమయం తీసుకోవచ్చేమో కానీ ఆదాయం పెంచుకోవడానికి మార్గం కనపడితే దానిని అమలుచేయడానికి ఎక్కువ సమయం తీసుకోదని అందరికీ తెలిసిందే. కనుక ఇక నుంచి రైలు ప్రయాణం అనుకున్నప్పుడు లగేజి పరిమితి గురించి కూడా గుర్తుంచుకొంటే మంచిది.