సంబంధిత వార్తలు

భారత వాయుసేనకు చెందిన తేలికపాటి యుద్ధవిమానం గుజరాత్ రాష్ట్రంలో ఖచ్ జిల్లాలో మంగళవారం ఉదయం కూలింది. ఈ ప్రమాదంలో విమాన పైలర్ సంజయ్ చౌహాన్ మృతి చెందగా, విమానం పడిపోతున్నప్పుడు ఆ ప్రాంతంలో గడ్డి మేస్తున్న పశువులను డ్డీకొనడంతో కొన్ని పశువులు కూడా చనిపోయినట్లు సమాచారం. జామ్ నగర్ లో గల వాయుసేనకు చెందిన విమానశిక్షణాకేంద్రం నుంచి రోజూవారి శిక్షణలో భాగంగానే సంజయ్ చౌహాన్ యుద్దవిమానం తీసుకొని బయలుదేరాడు కానీ కొద్దిసేపటికే విమానం నేలకొరిగింది. ఈ ప్రమాదానికి కారణం తెలియవలసి ఉంది. వాయుసేన అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని విమాన శిధిలాలను స్వాధీనం చేసుకొని ఈ ప్రమాదంపై దర్యాప్తు మొదలుపెట్టారు.