
ప్రస్తుతం దేశాన్ని గడగడలాడిస్తున్న నిఫా వైరస్ రాజకీయాలలోకి కూడా ప్రవేశించడం విశేషం. అంటే రాజకీయ నాయకులు ఎవరికో అది సోకిందని కాదు. దానిని రాజకీయాలకు వర్తింపజేస్తూ హర్యానా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ వ్యాఖ్యలు చేశారు.
తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే అయన ఈసారి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని నిఫా వైరస్ తో పోల్చుతూ ట్వీట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. “ రాహుల్ గాంధీ ఒక నిఫా వైరస్ తో సమానం. ఆయనతో చేతులు కలిపిన ఏ రాజకీయ పార్టీ అయినా నాశనం కావలసిందే,” అని ట్వీట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలు సహజంగానే మండిపడుతున్నారు. భాజపా నేతలు, మంత్రులు అధికారమదంతో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని హర్యానా కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.