
సిఎం కెసిఆర్ ప్రధాని నరేంద్ర మోడీని కలిసేందుకు ఆదివారం రాత్రి డిల్లీ వెళ్ళారు కానీ ప్రధానిని కలవకుండానె హైదరాబాద్ తిరిగివచ్చారు. నేటి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ మళ్ళీ విదేశీయాత్రలకు బయలుదేరుతున్నందున, ఆ పనులలో బిజీగా ఉండటంతో కెసిఆర్ కు అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయారు. కనుక కెసిఆర్ కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశమయ్యి, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థల గురించి వివరించి, వాటికి రాష్ట్రపతి ఆమోదం ఇప్పించవలసిందిగా కోరారు. అదికాక రాష్ట్రానికి సంబందించిన ఇతర అంశాలపై కూడా ఆయనతో చర్చించారు.
ఈ సమావేశంలో సిఎం కెసిఆర్ ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ రెడ్డి, మిషన్ భగీరథ చైర్మన్ వి.ప్రశాంత్ రెడ్డి, తెరాసఎంపి వినోద్ కుమార్ కూడా పాల్గొన్నారు.